Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణుకా చౌదరి రెస్టారెంట్‍‌లో విందారగిస్తుంటే.. పనిపిల్ల గుడ్లప్పగించి చూస్తూ నిలుచుండిపోయింది!

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Webdunia
గురువారం, 2 జూన్ 2016 (17:26 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె ఓ రెస్టారెంట్‌లో విందారగిస్తుంటే.. పనిపిల్ల మాత్రం గుడ్లప్పగిస్తూ అలానే నిల్చుండిపోయింది. దీన్ని రిషీ బాగ్రీ అనే నెటిజన్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఇపుడు వైరల్‌లా వ్యాపించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న పేరుగాంచిన రేణుకా చౌదరి.. ఓ చిన్నబాబును చూసుకునేందుకు ఓ అమ్మాయిని నియమించుకుంది. ఆ అమ్మాయితో పాటు.. రెస్టారెంట్‌కు తీసుకువెళ్లిన రేణుక, ఆమెకు భోజనం పెట్టించలేదు సరికదా, కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. రేణుక ఫ్యామిలీ భోజనం పూర్తయ్యేంత వరకూ ఆ అమ్మాయి, చిన్న బాబు వెనకాల నిలబడే ఉంది. ఎప్పుడు జరిగిందో తెలియని ఈ దృశ్యాన్ని రిషీ బాగ్రీ అనే వ్యక్తి, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టగా, దీన్ని 1700 మందికి పైగా షేర్ చేస్తూ, రేణుకా చౌదరిపై విరుచుకుపడ్డారు. 
 
మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన మహిళ, ఇలా చేస్తారా? అని ఒకరు, తిండి పెట్టించేందుకు డబ్బు లేకుంటే, పనమ్మాయిని తీసుకెళ్లకుండా ఉండాలని ఇంకొకరు, కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇలాగే ఉంటుందని మరొకరు, పెద్దల ఇళ్లలో పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆధునిక యుగపు బానిసల జీవితం ఇంతేనంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments