Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయో ప్రైవసీ రూమ్స్... ప్రేమ జంట‌లు... పెళ్ళికాని వారి కోసం కూడానా...?

హైద‌రాబాద్: పెళ్లి కాని వాళ్ళు... ప్రేమ జంట‌లు ప్రైవ‌సీ కోసం పాట్లు ప‌డుతుంటారు. పార్కుల్లో చెట్టులు, పుట్ట‌ల చాటున రొమాన్స్ చేస్తుంటారు. అలాంటి వారి కష్టాలు ఇక తీరినట్టే. పార్కులు ఇతరత్రా ప్రాంతాలకు ప్రైవసీ కోసం వెళ్లనవసరం లేదు. పోలీసు రైడింగుల ఆందో

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (18:52 IST)
హైద‌రాబాద్: పెళ్లి కాని వాళ్ళు... ప్రేమ జంట‌లు ప్రైవ‌సీ కోసం పాట్లు ప‌డుతుంటారు. పార్కుల్లో చెట్టులు, పుట్ట‌ల చాటున రొమాన్స్ చేస్తుంటారు. అలాంటి వారి కష్టాలు ఇక తీరినట్టే. పార్కులు ఇతరత్రా ప్రాంతాలకు ప్రైవసీ కోసం వెళ్లనవసరం లేదు. పోలీసు రైడింగుల ఆందోళన లేదు. ఎంచక్కా ఓయో హోటళ్లను బుక్ చేసుకోవచ్చు. రొమాన్స్‌కు ఓయో అన్ని సదుపాయాల్ని కల్పిస్తోంద‌ట‌. 
 
ఇప్పటివరకు కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే ప‌రిమిత‌మైన ఓయో సేవ‌లు ఇపుడు దేశ వ్యాప్తంగా 200 నగరాలకు విస్తరించారు. ఓయో 70 వేల హోటళ్లను బుక్ చేసుకుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, కరీంనగర్, వరంగల్ సహా పలు పట్టణాలకు ఓయో సేవల్ని విస్తరించింది. 
 
ప్రస్తుతం హోటళ్లు బుక్ చేసుకునే సమయంలో ఆధార్... ఇత‌ర ఫోటో ఐడీల‌తో పాటు ర‌క‌ర‌కాల ఆధారాలు అడుగుతారు. ఆడ, మగ వెళితే అనుమానంగా చూస్తారు. సవాలక్ష ప్రశ్నలు వేసి రూమ్ ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తారు. అన్ని ఐడీలు ఇచ్చినా పోలీసుల రైడింగ్ ఆందోళన వెంటాడుతుంది. ఇలాంటి కష్టాలు లేకుండా ఆన్‌లైన్ లోనే ఓయో హోటల్ రూంలను బుక్ చేసుకుని, ఓయో ప్రైవసీ రూంలను ఇవ్వనుంది. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఓయో అనుమతులు తెచ్చుకున్నద‌ట‌.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments