Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్.. సీపీ గారు పోలీస్ కానిస్టేబుల్ అంటే పిల్లని ఇవ్వడం లేదు..అందుకే నా రాజీనామా

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:35 IST)
పోలీస్ అని చెబితే పెళ్లి సంబంధాలు రావడం లేదని, ఒక వేళ వచ్చినా చివరి నివిషంలో చెడిపోతున్నాయని చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన రాజీనామా లేఖను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌కు పంపించారు. 
 
"సార్ నా కోసం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అందులో భాగంగా ఇటీవల ఓ పెళ్లి చూపులకు వెళ్లగా, పోలీసులకు పనిగంటలు ఎక్కువ 24 గంటలూ డ్యూటీలోనే ఉండాలని ఆ అమ్మాయి సంబంధం తిరస్కరించిందని, దాంతో పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఆ లేఖలో వాపోయాడు. కానిస్టేబుల్ ప్రతాప్ రాసిన లేఖ ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ప్రతాప్ రాసిన లేఖలో ఏముందంటే.. 'సార్.. ఇంజనీరింగ్ చదువుకున్న తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న ఇష్టంతో కానిస్టేబుల్ అయ్యానని.. కానీ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే వివాహాం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అంతేకాదు, పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నవారికి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్స్ లభించడం లేదన్నారు. 20 ఏళ్లు పనిచేసినా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌గానే ఉండిపోవాల్సి వస్తోందని తన ఆవేదన వ్య క్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments