Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రచందనం స్మగ్లరే సినీ నిర్మాత.. సహజీవనం చేస్తూ దర్జాగా విలాస జీవితం!

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (10:27 IST)
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలికి వస్తున్నాయి. ఎర్ర చందనం అక్రమ తరలింపుపై ఉక్కుపాదం మోపిన సీఐడీ పోలీసులకు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు తెలియవస్తున్నాయి. టాలీవుడ్‌లో ''ప్రేమ ప్రయాణం'' పేరిట సినిమాను తీసిన నిర్మాత ఎర్రచందనం స్మగ్లర్ అని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. ఆ స్మగ్లర్ పేరు మస్తాను వలి. అతనో ఎర్రచందనం స్మగ్లర్ అని పోలీసులు తేల్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో పోగైన కోట్లాది డబ్బుతో మస్తాన్ వలి సినీ నిర్మాత అవతారమెత్తాడు. తాను తీసిన చిత్రంలో హీరోయిన్ గా నటించిన నీతూ అగర్వాల్ తో సహజీవనం సాగిస్తూ అతడు దర్జాగా విలాస జీవితం గడుపుతున్నాడు. 
 
ఈ క్రమంలో దాదాపు రూ.35లక్షల విలువ చేసే ఫ్లాటును హైదరాబాదులో కొనుగోలు చేయడమే కాకుండా.. దానిని నీతూకు గిఫ్ట్‌గా ఇచ్చాడట. తాను తీసిన సినిమా లాభాలనేమీ ఇవ్వకపోవడంతో ఇక లాభం లేదని మస్తాన్ వలి రూటు మార్చాడు. ఏకంగా రాజకీయాల్లోకి దిగాడు. వైసీపీలో చేరి కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీగా ఎంపికయ్యాడు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతోనే అతడికి కష్టాలు మొదలయ్యాయి. 
 
ఇటీవలే ఎర్రచందనం దుంగలను తరలిస్తూ శిరివెళ్ల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అతడిని విచారించిన సందర్భంగా పోలీసులకు అతడు సినీ నిర్మాత అనే విషయం తేలింది. అయితే ఆ తర్వాత బెయిల్‌పై అతడు దర్జాగా బయటకు వచ్చేశాడు. అతడు విదేశాలకు పారిపోకుండా, అన్ని ఎయిర్ పోర్టులకు లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments