ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (12:09 IST)
ఏపీకి మరో ముప్పు పొంచి వుంది. మూడు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశముందని తెలిపింది.
 
అల్పపీడన ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలపై పడే అవకాశం ఉందని వివరించింది. అలాగే, కోస్తాలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 
 
ఇప్పటికే చెరువులు పూర్తిగా నిండిపోయివున్నాయి కాబట్టి.. వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీలోని పలు జిల్లాలు వరద భీభత్సానికి గురికాక తప్పదు. వాయుగుండం తుఫాన్ గా మారే విషయంపై మరో 48 గంటల్లో పూర్తి స్థాయిలో ఓ అంచనా ఏర్పడనుంది.
 
అలాగే 29న నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి కేంద్రం పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య  దిశగా ప్రయాణించవచ్చునని అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments