Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 3 నుంచి రాజధాని కేసులపై మళ్లీ విచారణ

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (19:53 IST)
అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని రైతులు, ఇతరులు వేసిన పిటిషన్‌పై మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. పిటిషన్‌లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

సీజే ఏకే గోస్వామి, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది.

జస్టిస్‌ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాల పై విచారణ నిలిచిపోయింది. హైకోర్టు విడుదల చేసిన రోస్టర్‌లో శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
 
అయితే రాజధాని భూములకు సంబంధించిన కేసుపై ఎప్పుడు విచారణకు షెడ్యూల్ ఖారారు చేయాలనే అంశంపై శుక్రవారం ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్, ఇటు రైతుల తరపున వాదించే న్యాయవాదులతో చర్చించారు.

గతంలో ఈ కేసు సంబంధించి ఇటు రైతుల నుంచి అటు ప్రభుత్వం నుంచి దాదాపుగా వాదనలు పూర్తయ్యే దశలో అప్పటి చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలి కావడంతో ఈ కేసులు విచారణ నిలిచిపోయింది.

అయితే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి వినేందుకు త్రిసభ్య ధర్మాసనం సిద్ధమైంది. ఈ కేసు విచారణ రెండు, మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments