Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వంటే నాకిష్టం' అంటూ పరాయి స్త్రీతో నమ్మించి భర్తను హత్య చేసిన భార్య

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (13:50 IST)
నువ్వంటే నాకిష్టం... నిన్ను చూడాలనివుంది... కొబ్బరితోటకు రండి పరాయి స్త్రీతో కట్టుకున్న భర్తకు ఫోన్ చేయించిన భార్య... చివరకు అతన్ని కొబ్బరితోటలో తన ప్రియుడుతో కలిసి చంపేసింది. రాజమండ్రి అర్బన్‌లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఉన్న చిక్కుముడిని స్థానిక పోలీసులు ఛేదించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజమండ్రి అర్బన్ కడియం మండలానికి చెందిన గుబ్బల వెంకటరమణ (35)కు జ్యోతి అనే మహిళతో వివాహమైంది. జ్యోతికి ఓ నర్సరీలో పని చేసే సతీష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ విషయం భర్తకు తెలిసి ఇద్దరినీ పిలిచి మందలించారు. దీంతో భర్తపై కసి పెంచుకున్న జ్యోతి.. తన ప్రియుడు సతీష్‌తో కలిసి చంపాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన స్నేహితురాలు నాగదేవి సాయం తీసుకుంది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, కట్టుకున్న భర్తకు నాగదేవితో ఫోన్ చేయించింది.. "నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడాలని వుంది. నేను కారు పంపిస్తాను. ఎక్కిరా. నేను ఉన్న చోటుకు డ్రైవర్ నిన్ను తీసుకొస్తాడంటూ" ఆప్యాయంగా మాట్లాడింది. ఈ మాటలు నమ్మిన వెంకటరమణ కారులో ఎక్కి వెళ్లాడు. 
 
ఆ కారు నేరుగా స్థానికంగా ఉండే ఓ కొబ్బరితోటలోకి వెళ్లి ఆగింది. అక్కడ సిద్ధంగా ఉన్న జ్యోతి, సతీష్‌, నాగదేవిలు ఒక్కసారిగా దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరుసటిరోజు వెళ్లి మృతదేహాన్ని తోటలోనే పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. అపుడు తోట యజమాని దుర్గాప్రసాద్ చూసి సతీష్‌ను నిలదీశాడు. దీంతో విషయం చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. దుర్గాప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఈ హత్యతో సంబంధం ఉన్న ఐదుగురుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments