Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో వర్షబీభత్సం.. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్...

హైదరాబాద్ నగరంలో గత అర్థరాత్రి వర్షబీభత్సం సృష్టించింది. ఫలితంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే, రాత్రికి రాత్రే హుస్సేన్ సాగర్‌కు జలకళ వచ్చింది. ఇందులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (09:49 IST)
హైదరాబాద్ నగరంలో గత అర్థరాత్రి వర్షబీభత్సం సృష్టించింది. ఫలితంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే, రాత్రికి రాత్రే హుస్సేన్ సాగర్‌కు జలకళ వచ్చింది. ఇందులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం వరకూ నీరు లేక బోసిపోయిన హుస్సేన్ సాగర్, తెల్లారేసరికి నిండుకుండలా కనిపిస్తోంది.
 
ముఖ్యంగా.. నైరుతీ రతుపవనాల కారణంగా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా, పంజాగుట్ట, ఉప్పల్, అంబర్ పేట రోడ్ నంబర్ 6, తాజ్ కృష్ణా జంక్షన్, అమీర్ పేట ఇమేజ్ ఆసుపత్రి, కేసీపీ జంక్షన్, బేగంపేట న్యూవే, నింబోలి అడ్డా, చింతల్ బస్తీ గోల్నాక, పుత్లీబౌలీ, సీబీఎస్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తున వర్షపు నీరు నిలిచివుంది 
 
ఈ వర్ష బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments