Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదక్ ట్రైన్ యాక్సిడెంట్: 18కి చేరిన మృతులు, వైష్ణవి మృతి!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (13:34 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణవి(11) మంగళవారం ఉదయం 5.30గంటలకు తుది శ్వాస విడిచింది. దీంతో మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. 
 
ఆరో తరగతి చదువుతున్న వైష్ణవి స్వస్థలం మెదక్ జిల్లా ఇస్లాంపూర్. వైష్ణవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. గత ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణమృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
 
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ప్రశాంత్, వరుణ్ గౌడ్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నితూష, శరత్‌ల పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మిగిలిన 14మంది చిన్నారులు కోలుకుంటున్నారు. కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తరుణ్ (7) సోమవారం మృతి చెందాడు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments