Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రకు అమరాతి ఒక్కటే రాజధాని : రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:08 IST)
నవ్యాంధ్రకు రాజధాని అమరావతి ఒక్కటేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఆయన ఆలూరు సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం యాత్ర తిరిగి ప్రారంభమై ఆలూరు హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని మండలం శాగి గ్రామం వరకు కొనసాగనుంది. 
 
రాత్రి రాహుల్ అక్కడే బస చేస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఉదయం నుంచి జరుగుతున్న యాత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ జేడీ శీలం, పార్టీ సీనియర్‌ నేత కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ యాత్ర జయప్రదం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు జన సమీకరణ చేపట్టారు.
 
ఈ సందర్భంగా అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వీరిలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, పోలవరం నిర్వాసిత రైతులు ఉన్నారు. స్థానిక రైతులతో కలిసి నినాదాలు చేస్తూ రాహుల్‌ బస చేసిన శిబిరానికి చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు. 
 
అమరావతి రైతుల వినతిపై రాహుల్ స్పందిస్తూ, 'ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఏకైక రాజధాని కావాలి. అమరావతి రైతుల పోరాటానికి నేను సంఘీభావం తెలుపుతున్నా. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం' అని రాహుల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments