Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుజనా బల్లలు చరుస్తారా...? బాబు ఢిల్లీ వచ్చి బిల్లును అడ్డుకున్నారు... ఏపీ విద్రోహక దినం

రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై బిల్లును లోక్ సభకు పంపిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కురియన్ ప్రకటించగానే భాజపా ఎంపీలతో పాటు తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరచడం ఇప్పుడు ఏపీ ప్రజలను షాక్ కు గురి చేస్తోంది. ఈ వ్యవహారంపై తెదేపా శ్రేణులు కూడా ఆశ్చర్యాన్ని

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (22:22 IST)
రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై బిల్లును లోక్ సభకు పంపిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కురియన్ ప్రకటించగానే భాజపా ఎంపీలతో పాటు తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరచడం ఇప్పుడు ఏపీ ప్రజలను షాక్ కు గురి చేస్తోంది. ఈ వ్యవహారంపై తెదేపా శ్రేణులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుంటే తెదేపా-భాజపాల నటనా చాతుర్యాలు బయటపడ్డాయని ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్ నుంచి విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు ఢిల్లీ వచ్చి బిల్లును అడ్డుకున్నారని అన్నారు. 
 
ఈ రోజు ఏపీ విద్రోహక దినంగా భావిస్తున్నాం  అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులకు జ‌రిగిన అవమానం అన్నారు. పుష్కరాలు ఏ రాష్ట్రంలోనూ జరగవన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని భంగం. రాజ్యసభకే అవమానం. సాక్షాత్తూ ప్రధాని హామీనే తుంగలో తొక్కారు అన్నారు. మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ సైతం తను ప్రధానిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేడుకున్నా ప్రయోజనం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ పెట్టితీరాలని టీడీపీ ఎం.పి. సీఎం రమేష్ ప్రయత్నించకపోవటం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి మాటను సీఎం రమేష్ రాజ్యసభలో అమలు చేశాడని అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటానికి సిద్ధంగా లేదని, ఇవ్వమని చెప్పే ధైర్యం కూడా తెదేపాకు లేదని ఎద్దేవా చేశారు. సాంకేతికపరమైన విషయాలను సాకుగా చూపి బిల్లును పక్కన పెట్టటం సరైంది కాదు అన్నారు.
 
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నందునే సోనియాకు ఆరోగ్యం బాగాలేకపోయినా సభ్యలు హాజరు కావాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. మోదీ- చంద్రబాబు ఆట ముగియలేదని గుర్తుంచుకోవాలి. ఆంధ్ర ప్రజలు బంతి మీ కోర్టులోనే వేశారు అని హెచ్చ‌రించారు. సోమవారం కాంగ్రెస్ రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీపై ఒక తీర్మానం చేయబోతోంది. దీనిపై కాంగ్రెస్ పెద్దలు రాజ్యసభలో మిగిలిన పార్టీలతో మాట్లాడుతున్నారని... ఎంపీలు కాంట్రాక్టుల కోసమే ప్రధాని దగ్గరకు వెళ్ళారని ఆరోపించారు. భాజపా పట్ల తెదేపా నాయకులు ఆంధ్రలో ఒకలా ఢిల్లీలో మరోలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
 
సీఎం ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్యాకేజీలు ఆంధ్రులకు అవసరం లేదని స్పష్టం చేశారు... దోపిడి, ప్యాకేజీల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. రాజకీయ అజెండాతో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. నియోజకవర్గాల పెంచుకోవటానికే చంద్రబాబు రాజకీయ అజెండాతో ముందుకెళ్తున్నారని అన్నారు.  కేంద్రంపై కోపంగా ఉన్నట్లు లీకులు ఇస్తూనే చంద్రబాబు అరటి ఆకులా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఏపీ ప్రజలకు క్షమాపణ ఎవరు చెప్తారో వెంకయ్య, అరుణ్ జైట్లీలు నిర్ణయించుకోవాలి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments