ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ : ఆ వెంటనే ఢిల్లీకి పయనం

Webdunia
బుధవారం, 26 మే 2021 (13:15 IST)
వైకాపా అధిష్టానంపై తిరుగుబాటు చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విష‌యం తెలిసిందే.
 
ఈ కేసులో సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసింది. దీంతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి ఆయ‌న డిశ్చార్చ్ అయ్యారు. ఆ త‌ర్వాత వెంట‌నే బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరారు. ఢిల్లీలో ఆయ‌న‌ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 
 
సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో ఆయ‌న విడుద‌ల‌కు కావాల్సిన ప్ర‌క్రియ అంతా ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు పూర్తి చేశారు. ర‌ఘురామ కాళ్ల‌నొప్పితో పాటు ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments