Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రోజుల్లో పెళ్లి.. రేడియాలజిస్టు సూసైడ్... మృతదేహం పక్కన మిజోలం బాటిల్స్‌...

మరో పది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ వైద్యుడు... ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కనే మిజోలం బాటిల్స్ ఉండటంతో మిజోలం అనే సెలైన్ బాటిల్‌లో ఉండే మత్తుపదార్థం సేవంచి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (09:51 IST)
మరో పది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ వైద్యుడు... ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కనే మిజోలం బాటిల్స్ ఉండటంతో మిజోలం అనే సెలైన్ బాటిల్‌లో ఉండే మత్తుపదార్థం సేవంచి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ సప్తగిరికాలనీకి చెందిన గ్రానైట్‌ వ్యాపారి తిరుపతిగౌడ్‌ కుమారుడు శివానంద్‌గౌడ్‌(30) నగరంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్‌ హైదర్‌గూడలోని జనప్రియా అపార్ట్‌మెంట్‌లోని నాలుగో బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు నివశిస్తున్నాడు.
 
వచ్చే నెల 8వ తేదీన వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో సెలైన్‌బాటిల్‌లో మిజోలం అనే మత్తు పదార్థం శరీరంలో సెలైన్‌ద్వారా ఎక్కించుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కన ఐదు మిజోలం బాటిల్స్‌ పడి ఉన్నట్లు ఎస్సై వివరించాడు. 
 
మూర్ఛవ్యాధి నివారణకు వాడే ఈ మందును ఎక్కువ మోతాదులో తీసుకుంటే వ్యక్తి మరణిస్తాడు. తి చెందుతాడని ఓ వైద్యుడు తెలిపారు. కరీంనగర్‌ నుంచి అతని కుటుంబ సభ్యులు వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments