Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌పై పెద్ద పంచ్ పడింది.. ఆర్ కృష్ణయ్య కరిచేశారు

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పెద్ద పంచ్ పడింది. ఏది మాట్లాడినా ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడే పవన్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యకు దొరికిపోయారు. పవన్ తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలీకుండా మాట్లాడుతున్నారా అంటూ కృష్ణయ్

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (07:55 IST)
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పెద్ద పంచ్ పడింది. ఏది మాట్లాడినా ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడే పవన్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యకు దొరికిపోయారు. పవన్ తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలీకుండా మాట్లాడుతున్నారా అంటూ కృష్ణయ్య మండిపడ్డారు. గొడవ ఏదంటే కాపులను బీసీలో కలపడంపైనే. 
 
కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వ్యతిరేకించని ఆర్‌.కృష్ణయ్య ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని పవన్ ప్రశ్నించారు. కానీ కాపులను బీసీల్లో కలపడంపై తొలినుంచీ మాట్లాడుతూనే ఉన్నానని ఈ విషయమై నాటి ప్రభుత్వం 1994లోనే జీవో జారీ చేస్తే హైకోర్టుకు వెళ్లి మరీ కొట్టివేయించానని కృష్ణయ్య వివరించారు. చిరకాలంగా నలుగుతున్న సమస్యపై కాస్త వెనకా ముందూ తెలుసుకుని మాట్లాడితే మంచిదని పవన్‌కు సూచించారు కూడా.
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత పవన్ కల్యాణ్ మీడియా ముందు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వ్యతిరేకించని ఆర్‌.కృష్ణయ్య.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు.  
 
కాపులను బీసీలో కలుపుతామని 1994లో ఒక జీవో జారీ చేస్తే దానిపై హైకోర్టుకు వెళ్లామని, ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన విషయం పవన్‌ కల్యాణ్‌ తెలుసుకొని మాట్లాడాలన్నారు. అదేవిధంగా 1998, 2000 సంవత్సరంలో జాతీయ కమిషన్‌ వచ్చినప్పుడూ అడ్డుకున్నామని గుర్తుచేశారు. కాపులను బీసీలో కలపడం అంటే ఒక పులి, ఒక ఎద్దుతో నాగలి కట్టడమేనన్నారు. కాపులను బీసీ జాబితాలో కలపాలంటే కొన్ని అర్హతలుండాలని వివరించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments