Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి ప‌న్ను పెంపుపై నిర‌స‌న‌... విజ‌య‌వాడ‌లో ఉద్రిక్త‌త‌

Webdunia
గురువారం, 15 జులై 2021 (18:12 IST)
రాష్ట్ర ప్ర‌భుత్వం ఆస్తి ప‌న్ను, చెత్త ప‌న్ను పెంచ‌డంపై న‌గ‌ర పౌరులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సిపిఐ, సిపిఎం ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పైన దండెత్తారు. వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు విజ‌య‌వాడ న‌గ‌ర వీధుల్లోకి రావడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష్‌కు చేరుకుంటున్న ఆందోళ‌న కారుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా వ్యానుల్లోకి ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా సీపిఎం, సిపీఐ నాయ‌కులు వ‌రుస‌గా అరెస్ట్ అవుతున్నారు. ఈ ఛ‌లో కార్పొరేష‌న్ ఆందోళ‌న చేయ‌ద్ద‌ని పోలీసులు ముందుగానే 144 సెక్ష‌న్ ఆంక్ష‌ల నోటీసుల‌ను వామ ప‌క్ష నేత‌ల‌కు ఇచ్చారు. చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. అయినా, వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌లు మొండిగా ర్యాలీ తీశారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కి చేరారు. దీనితో వారంద‌రినీ చెద‌ర‌గొట్టి అరెస్టులు చేస్తుండ‌టంతో న‌గ‌రం ఉద్రిక్తంగా మారింది.
 
విజయవాడలో సిపిఐ, సిపిఎం నాయకుల హౌస్ అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. పోలీసులను ప్రయోగించి ప్రజా ఉద్యమాలను ఆపాలనుకోవడం అవివేక‌మ‌న్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, చెత్తపన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాల‌ని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments