అమరావతిలో సినిమా వారికి నిరసన

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:25 IST)
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి వచ్చిన సినీ ప్రముఖులకు రాజధాని రైతుల సెగ తగిలింది. మంగళవారం హైదరాబాద్‌ నుండి సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.సురేష్‌బాబు తదితరులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడి నుండి ఉండవల్లిలోని మాజీ ఎంపి గోకరాజు గంగరాజు గెస్ట్‌ హౌస్‌కు వచ్చారు. ఇది తెలుసుకున్న రాజధాని రైతులు వారు బస చేసిన గెస్ట్‌ హౌస్‌ దగ్గరకు చేరుకున్నారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలపాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను పంపించి వేశారు. అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలు మంగళవారానికి 175వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారి పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో పొలిటికల్‌, నాన్‌ పొలిటికల్‌ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతుల న్యాయమైన పోరాటానికి జెఎసి అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

Yash: గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా టాక్సిక్ ఉంటుందన్న యశ్

Mahesh Babu: శ్రీనివాస మంగాపురం టీజర్ ఆవిష్కరించి మెచ్చుకున్న మహేష్ బాబు

ఆసక్తికరంగా డార్క్ డేంజరస్ హారర్ థ్రిల్లర్ ప్రీ లుక్ పోస్టర్‌‌

Arya: క్రిమినల్స్ అంతా వారణాసిలోనే వున్నారు : కథానాయకుడు ఆర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments