Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పా సెంటరులో వ్యభిచారం... 10 మంది యువతుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:50 IST)
హైదరాబాద్ నగరంలో బ్యూటీ సెలూన్, స్పా సెంటరు పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మంది అరెస్టు చేశారు. వీరిలో 10 మంది విటులు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురు నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ సెంటరులో జరిగింది. 
 
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీ సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో స్పా నిర్వాహకుడితోపాటు అందులో పనిచేస్తున్న ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులను అరెస్ట్ చేశారు.
 
వీరి నుంచి రూ.73 వేల నగదు, 28 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు రూ.4 లక్షలు నిల్వ ఉన్న బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments