Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వైపు సంక్రాంతి సంబురాలు.. మరోవైపు ఇంట్లో వ్యభిచారం... ఎక్కడ?

ఈ యేడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు మిన్నంటాయి. గతానికి భిన్నంగా ఈ యేడాది ఈ పండుగను జరుపుకున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ ద్యోగులంతా నూతన రాజధాని అమరావతికి రావడంతో తమతమ సొంతూళ్ళకు సులభంగా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (14:16 IST)
ఈ యేడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు మిన్నంటాయి. గతానికి భిన్నంగా ఈ యేడాది ఈ పండుగను జరుపుకున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ ద్యోగులంతా నూతన రాజధాని అమరావతికి రావడంతో తమతమ సొంతూళ్ళకు సులభంగా వెళ్లగలిగారు. దీంతో ఈ సంక్రాంతి సంబరాలకు కొత్త శోభ చేకూరింది. దీనికితోడు ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదల కావడంతో చిరంజీవి, బాలకృష్ణ అభిమానులకు కొత్త జోష్ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంక్రాంతి సంబురాల మాటున విచ్చలవిడిగా వ్యభిచారం జరిగింది. 
 
అదీ కూడా పట్ణంలోని పశువుల ఆసుపత్రి పక్క రోడ్డులోనే నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. వీరంతా కలిసి బయట గ్రామాల నుంచి కొందరు యువతులను పట్టణంలోకి తీసుకొచ్చి ఈ వ్యభిచారం చేస్తున్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. అద్దంకి పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వ్యభిచార గృహాలు నిర్వహించే వివరాల గురించి పోలీసులు కూపి లాగుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments