Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుటుంబ సభ్యులే 22 మంది.. నాకొచ్చిన ఓట్లు నాలుగు : కేఏ పాల్

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (14:12 IST)
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తన కుటుంబంలో 22 మంది సభ్యులు ఉన్నారని, కానీ తనకు పోలైన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. విశాఖలో తొలి నుంచీ తానే ఆధిక్యంలో ఉన్నానని అధికారులు కూడా తనకు చెప్పారని గుర్తు చేశారు. అయితే, అనేక బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రీపోలింగ్ జరపాలని కోర్టుకెళ్లానని ఆయన తెలిపారు. మురళీ నగర్‌లోని పోలింగ్ బూత్ 235లో తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు తనకు ఓటు వేస్తే అక్కడ తనకు వచ్చిన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని గుర్తు చేశారు. 
 
రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. అప్పట్లో నరేంద్ర మోడీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ఈసారి సీసీటీవీ లింకులను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరకు తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులో చెప్పారని, కానీ 8 బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని కేఏ పాల్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments