Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న విజయవాడలో 'ప్రజా పాదయత్ర'

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:41 IST)
అమరావతి రాజధానిగా ప్రకటించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ, రైతు ఐకాస సమితి ఆధ్వర్యంలో ఈనెల 15 (మంగళవారం) విజయవాడలో తల పెట్టిన “అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్ర"ని జయప్రదం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కన్వీనర్లు ఏ. శివారెడ్డి, గద్దె తిరుపతిరావు పిలుపునిచ్చారు.

విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి జెఏసి రాష్ట్ర కార్యాలయంలో అమరావతి పరిరక్షణ సమితి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, దళిత, బహుజన, పౌర సంఘాలు, కార్మిక, కర్షక, వర్తక సంఘాల నాయకులు సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా శివారెడి మట్లాడుతూ రాజధానికి భూమిలిచ్చిన రైతులకు, రైతు కూలీల కుటుంబాలకు అండగా జెఏసీ ఉందని, అమరావతి రైతన్నలకు మద్దతుగా 5 కోట్ల ఆంధ్రుల రాజధానికై “ప్రజా ర్యాలీ ని జయప్రదం చేయాలని కోరారు.

వైసిపి మినహా అన్ని రాజకీయ పక్షాలు పాల్గొంటున్నాయని, అమరావతినే రాజధానిగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అమరావతిని సాధించుకునేంత వరకు మా పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
 
కోకన్వీనర్ గద్దె తిరుపతి రావు మాట్లాడుతూ అమరావతి కోసం ఏడాది నుండి ఉద్యమం సాగుతుందని, రాజధానిని సాధించుకునే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఉ ద్యమంలో భాగస్వాములు కావలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాపితంగా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని, ఈ నెల 17న ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయని పాలెంలో “బహిరంగ సభలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బేజషాలు వదిలి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు.
 
సమావేశంలో సుంకర పద్మశ్రీ, గద్దె అనూరాధ, పి.దుర్గాభవానీ, చెన్నుపాటి ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జెఏసీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments