Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అవకాశం: ఐఎండీ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:11 IST)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర అండమాన్ తీర ప్రాంతం నుండి తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం నుండి దానికి ఆనుకొని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకు అల్పపీడనం ఉందని దానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
 
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాలలో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 9వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత మరో మూడు నుండి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
కాగా నిన్న కూడా తెంలంగాణలో పలు ప్రాంతాలలో వర్షపాతం నమోదైంది. నారాయణపేట్ ప్రాంతంలో అత్యధికంగా 4.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగతా జిల్లాలలో చిరుజల్లులు కురిశాయి. ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయని ఈ సీజన్లో ఇప్పటి వరకు సగటున 18.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నిన్నటి వరకు 5 మిల్లీ మీటర్ల వర్షపాతం వరకే నమోదైనట్లు రానున్న అల్పపీడనంతో మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments