Webdunia - Bharat's app for daily news and videos

Install App

Posani: పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందా? సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారు?

సెల్వి
శనివారం, 1 మార్చి 2025 (19:21 IST)
Posani
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం పోసాని జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందని, తెల్లవారుజామున కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
ప్రాథమిక పరీక్షల తర్వాత, ఛాతీలో అసౌకర్యం ఉందని అతను ఫిర్యాదు చేస్తూనే ఉండటంతో, వైద్య సహాయం కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, రైల్వే కోడూర్ గ్రామీణ సిఐ వెంకటేశ్వర్లు ఈ సంఘటనపై స్పందించారు. ఇదంతా డ్రామా అన్నారు. ఛాతీ నొప్పి, అసౌకర్యం గురించి ఫిర్యాదు చేస్తూ పోసాని డ్రామా చేశారన్నారు. పోసానికి అవసరమైన అన్ని పరీక్షలు చేయడం జరిగింది. పూర్తి ఆరోగ్యంతోనే పోసాని వున్నారని సీఐ వెల్లడించారు. 
 
పోసాని ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ పేర్కొన్నారు. పోసాని తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు చికిత్స అవసరమని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయగా, ఏపీ పోలీసులు మాత్రం ఇవన్నీ అసత్యాలని తోసిపుచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments