పోలీసుశాఖ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఆదరణ: డి ఐ జీ త్రివిక్రమ వర్మ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (07:20 IST)
అనాధ పిల్లల చేయూత కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గుంటూరు డి ఐ జీ త్రివిక్రమ వర్మ అన్నారు. ఆయన నరసరావుపేట కు విచ్చేసి డిఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో వన్ టౌన్, టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 సంవత్సరాల లోపు ఉన్న అనాధ పిల్లలను, భిక్షాటన చేస్తూ ఉండేవారిని అదుపులోకి తీసుకుని వారి ప్రస్తుత జీవన పరిస్థితి గల కారణాలను తెలుసుకొని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకు రావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు డి ఐ జి త్రివిక్రమ వర్మ అన్నారు.

తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంరక్షణా కేంద్రాలలో, పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్ కోసం కార్యాచరణ చేసినట్లు తెలిపారు. ఇంకా గంజాయి, జూదం, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను దుర్భరం చేసుకుంటున్న పిల్లలకు ప్రత్యేక చర్యలు తీసుకునే వారిని సన్మార్గంలో నడిపించడానికి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కార్యక్రమంలో నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎమ్ వీరారెడ్డి, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రవి చంద్ర, ఒన్ టౌన్ సీఐ సి హెచ్ ప్రభాకర్ రావు, టూ టౌన్ సీఐ పి కృష్ణయ్య, రూరల్ సీఐ యంపరాల అచ్చయ్య, దిశ పోలీస్ స్టేషన్ సీఐ కరుణాకర్, ఎస్సైలు బ్రహ్మం వెంకటేశ్వర్లు, రెబ్బాని ఖాన్ ఆయా స్టేషన్లు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments