Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు : పొన్నం ప్రభాకర్ ధ్వజం

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (19:31 IST)
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని, ఆయన ఇష్టమొచ్చినట్టుగా పాలన చేయడానికి, నడుచుకోవడానికి అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. 
 
ఇలా చేయడానికి కేసీఆర్‌దేమైనా రాజరికమా..? లేక జమిందార్ పాలనా? అని పొన్నం నిలదీశారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, ప్రాజెక్టులపై అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం.. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి.. తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరు కాదన్నారు. 
 
ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ను నిందిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రాజెక్టులపై అప్పుడెందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌, మంత్రులు పిచ్చి తుగ్లక్‌లను తలపిస్తున్నారని విమర్శించారు. రైతులను కించపరిచేలా మాట్లాడుతున్న తెరాస సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments