స్థానిక సంస్థల ఎన్నికలల్లో వేలికి సిరా ఇలా...

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:01 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగనున్న స్థానిక ఎన్నిక‌ల‌ల్లో ఓటు వేసిన ఓట‌ర్ల‌కు ఎక్క‌డ ఎలా సిరా గుర్తు పెడ‌తారో అధికారులు తెలిపారు. కృష్ణా కలెక్టర్ జె నివాస్ ఒక ప్రకటన ద్వారా ఈ వివ‌రాల‌ను తెలిపారు.

 
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా  ఈనెల 14 న ఆదివారం నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించునే ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు చెరగని సిరా గుర్తు వేస్తార‌ని,  జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి జె. నివాస్ తెలిపారు. అదేవిధంగా ఈనెల 16న మంగళవారం నిర్వహించే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో  ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేస్తార‌ని పేర్కొన్నారు.
 
 
ఓట‌ర్లు పోలింగ్ బూత్ ల వ‌ద్ద స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల‌ని అధికారులు తెలిపారు. మాస్కులేకుండా పోలింగ్ బూత్ లోకి ప్ర‌వేశం ఉండ‌ద‌ని, అలాగే, ఎవ‌రూ గుంపులు గుంపులుగా బూత్ లోకి ప్ర‌వేశించ‌రాద‌ని తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని ప్రోత్స‌హించ‌కుండా, అంతా దూర దూరంగా ఉండి పోలింగ్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు నిర్వ‌హించాల‌ని కోరారు. దీనికి సంబంధించి అధికార బందోబ‌స్తు పూర్త‌యింద‌ని, పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగేలా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments