Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్క గదిలో దిగిన జంట, యువతిని కోర్కె తీర్చాలంటూ ఎస్సై వేధింపు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (11:20 IST)
రక్షించాల్సినవాడే కామం కోర్కెలతో పక్కదారి పట్టాడు. పక్క గదిలో వున్న ఓ యువతిని తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. విషయం బయటకు రావడంతో బుక్ అయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే... అమరావతిలోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో పెదకూరపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక జంట గది అద్దెకు తీసుకుంది. ఈ విషయాన్ని అదే వీధిలో వేరే అతిథి గృహంలో వున్న ఎస్ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ గమనించారు. వెంటనే ఇద్దరూ వెళ్లి ఆ గదిలో పోలీసు రైడ్ అంటూ బెదిరించారు.
 
 తమకు రూ. 10వేలు ఇవ్వాంటూ డిమాండ్ చేయడంతో సదరు యువకుడు రూ. 5 వేలు ఇస్తానని అంగీకరించాడు. తనవద్ద వున్న రూ.3 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.2 వేలు సమీపంలోని ఏటీఎం నుంచి డ్రా చేసి ఇస్తానన్నాడు. దాంతో ఆ యువకుడి వెంట తన డ్రైవరును ఇచ్చి పంపిన ఎస్ఐ గదిలో ఒంటరిగా వున్న యువతిపై కన్నేశాడు.
 
 తన కోర్కె తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె అందుకు తిరస్కరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్న సమయంలో ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుని యువకుడు తిరిగి వచ్చాడు. దీనితో డబ్బు తీసుకుని ఆ జంటను వదిలేశారు. తమపై జరిగిన ఈ దారుణాన్ని ఆ జంట పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments