Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం ఆపండ్రా బాబూ... ఆపండి.... అంటూ అడ్డుపడిన ఖాకీలు.. పెళ్లి రద్దు.. ఎందుకు..?

Webdunia
మంగళవారం, 24 మే 2016 (14:54 IST)
పెళ్లయిన నవదంపతులకు పెద్దలు శోభనం తంతు నిర్వహించడం సహజం. ఈ తంతులో భాగంగా ఓ పెళ్లికొడుకు శోభనానికి రెడీ అయ్యాడు. అంతలోనే ఎక్కనుండి వచ్చారో తెలీదుగానీ, పోలీస్ వాహనం వచ్చి ఇంటి ముందు ఆగింది. ఆగమేఘాలతో లోపలికి వచ్చిన వారు వెంటనే ఈ శోభనాన్ని ఆపాలంటూ బిగ్గరగా అరిచారు. ఈ శోభన కార్యక్రమాన్ని రద్దు చేసి ఓ యువతి జీవితాన్ని పోలీసులు కాపాడారు. శోభనాన్నిఆపడమేంటి... యువతి జీవితాన్ని కాపాడడమేంటి... అని తలబద్దలు కొట్టుకుంటున్నారా.... అయితే ఈ కథనం చదవాల్సిందే... 
 
తూర్పు గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన ఈ యువకుడు(23) కొంతకాలం క్రితం గల్ఫ్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎయిడ్స్‌ ఉన్నట్లు నిర్ధారించారు. 
 
ఈ విషయాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకోవడమే కాకుండా, శోభనానికి కూడా రెఢీ అయ్యాడు ఈ ప్రబుద్ధుడు. ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి ఈ శోభన కార్యక్రమాన్ని ఆపి ఆ యువతిని రక్షించాడు. 
 
వరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తనకు ఎయిడ్స్‌ ఉన్నట్టు అంగీకరించాడు. దీంతో ఆ పెళ్లిని రద్దు చేయడానికి ఇరు వర్గాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు. సరైన సమయంలో యువతి జీవితాన్ని కాపాడిన వ్యక్తిని స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌, పోలీసులు, కుటుంబసభ్యులు అభినందించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments