Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోటస్‌ పాండ్ జగన్ ఇంటి భద్రత కోసం రూ.24 లక్షలు... బ్యాగేజ్ స్కానర్లు...

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నివసించే గృహాలకు భద్రత పెంచుతున్నారు. ముఖ్యంగా, అమరావతిలో ఉన్న ఆయన నివాసంతో పాటు, క్యాంపు కార్యాలయంలో గట్టి భద్రతను ఏర్పాట్లు చేశారు. అలాగే, హైదరాబాద్‌ బంజారా హిల్స్ లోటస్‌పాండ్‌లో జగన్ నివాసం ఉంది. ఈ నివాసానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ఇందుకోసం ఏపీ సర్కారు రూ.24.50 లక్షలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో బ్యాగేజ్ స్కానర్లు, అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను లోటస్ పాండ్‌లో ఏర్పాటు చేయనున్నారు. జగన్ సీఎంగా ఎన్నికైన తర్వాత, హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారన్న సంగతి తెలిసిందే. 
 
అయితే, ఈ భద్రతా ఏర్పాట్లు సరిపోవని భావించిన ఉన్నతాధికారులు, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి బ్యాగులనూ తనిఖీ చేయాల్సిందేనని సూచించారు. దీంతో బ్యాగేజ్ తనిఖీ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమయ్యే నిధులను రహదారులు, భవనాల శాఖ నుంచి ఖర్చు చేసేందుకు అనుమతిస్తూ, ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
 
కాగా, కృష్ణానది కరకట్టపై ప్రభుత్వ నిధులతో కట్టించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసింది. కానీ, జగన్ మోహన్ రెడ్డి అటు హైదరాబాద్, ఇటు అమరావతిల్లో ఉన్న వ్యక్తిగత నివాసాలకు మాత్రం ప్రజాధనంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకోడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments