Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా ఉన్నావ్... నా కోర్కె తీర్చవు... కోర్టు ఆవరణలోనే వివాహిత‌పై ఖాకీ లైంగిక వేధింపులు

రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలోనే ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఊట్కూరులో ఈ ఘ‌ట‌న చోటుచేసు

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:02 IST)
రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలోనే ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఊట్కూరులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 
 
పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం గ్రామానికి చెందిన గిరిజ అలియాస్ వ‌న‌జ భ‌ర్త నుంచి వేరుగా ఉంటోంది. మ‌నోవ‌ర్తి కేసు నిమిత్తం మంగ‌ళ‌వారం నారాయ‌ణ‌పేట కోర్టుకు వ‌చ్చింది. మ‌ధ్యాహ్నం తిరిగి ఊరికి వెళ్తున్న స‌మ‌యంలో కోర్టు మెట్ల కిందున్న ఖాళీ స్థ‌లంలో ఊట్కూరు కోర్టు కానిస్టేబుల్ రామాంజ‌నేయులు ఆమెను అడ్డుకుని నీవు చాలా అందంగా ఉన్నావ్... ఒక్కసారి నా కోర్కెను తీర్చవా అంటూ బ‌ల‌వంతంగా మెట్ల కింద‌కు లాక్కెళ్లి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. 
 
కానిస్టేబుల్ ప్ర‌వ‌ర్త‌న‌తో షాక్‌కు గురైన గిరిజ తేరుకుని కేక‌లు వేయ‌డంతో రామాంజ‌నేయులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఆ వెంట‌నే బాధితురాలు జ‌డ్జి సాయికుమార్‌కు లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. రామాంజనేయులును ఎస్పీ కార్యాల‌యానికి అటాచ్ చేస్తున్న‌ట్టు డీఎస్పీ శ్రీ‌నివాస‌రెడ్డి పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం