Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు... లీటరు ధరపై ఎంతంటే?

ఠాగూర్
శుక్రవారం, 15 మార్చి 2024 (12:36 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రం ఈ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ఫలితంగా లీటరు పెట్రోల్‍‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గించింది. ఈ సవరించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల తగ్గుదలపై కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటన చేసింది. 
 
చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజల్ ధరలను దేశవ్యాప్తంగా సవరిస్తున్నట్టు సమాచారం ఇచ్చామని పెట్రోలియం శాఖ వెల్లడించింది. ఈ తగ్గింపు నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తుందని, డీజిల్‌తో నడిచే 58 లక్షల గూడ్సు వాహనాలు, ఆరు కోట్ల కార్లు, 277 కోట్ల ద్విచక్రవాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. లీటరు పెట్రోల్‌పై రూ.2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజల్ ధరలు శుక్రవారం నుంచి ఇలా ఉన్నాయి. 
 
దేశ వ్యాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ పాత ధర రూ.106.31 కాగా, కొత్త ధర ప్రకారం రూ.104.21కు చేరుకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పాత ధర రూ.96.72గా ఉంటే కొత్త ధర ప్రకారం రూ.94.72కు చేరుకుంది. అలాగే, కోల్‌కతాలో పాత ధర రూ.106.03గా ఉండగా, కొత్త ధర రూ.103.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ పాత ధర రూ.102.63కాగా, కొత్త ధర రూ.100.75గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments