Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వాహనాలు తెలంగాణలోకి ఎంట్రీ కావాలంటే టాక్స్ తప్పదా?

Webdunia
బుధవారం, 30 జులై 2014 (11:49 IST)
ఏపీ వాహనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఇకపై పన్ను కట్టాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణలో రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఇకపై తెలంగాణ రవాణాశాఖకు త్రైమాసిక పన్ను కట్టాల్సిందే. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టు, గూడ్స్ వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్స్, ప్యాసింజర్ ఆటోరిక్షాలకు వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలతోపాటు, వ్యక్తిగత వాహనాలకు ఈ పన్ను నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments