Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దున్నపోతు బాలయ్య' కనిపించడం లేదు... హిందూపురం పీఎస్‌లో ఫిర్యాదు...

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా, బాలకృష్ణ కోసం గాలిస్తూ... వింత నిరసనలకు దిగారు. నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (17:06 IST)
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా, బాలకృష్ణ కోసం గాలిస్తూ... వింత నిరసనలకు దిగారు. నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. 
 
హిందూపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని పరిష్కరించలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు దిగాయి. బాలకృష్ణ సినిమాలు తీయడంపై మాత్రమే దృష్టిపెట్టారని.. నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. 
 
అంతటితో ఊరుకోని వారు.. రోజుకోరీతిన తమ నిరసనలు వ్యక్తం చేస్తూ.. వింతవింతగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని, నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ… దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు. 
 
అప్పటికీ శాంతించని ఆందోళనకారులు... గేదేలు, దున్నపోతులపై ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ పేర్లను రాసి నిరసన తెలిపారు. గతంలో బాలకృష్ణ కనబడటం లేదంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. తాజాగా దున్నపోతులపై పేర్లు రాసి నిరసన తెలుపడం చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments