Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎన్నికలు కోసం పార్టీలు సిద్ధం.. పవన్ బస్సు స్పెషాలిటీ ఏంటంటే?

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:34 IST)
ఏపీ ఎన్నికల కోసం అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రజా కార్యక్రమాలతో మమేకమైన ఆ పార్టీ అధినేత పవన్ ఇక బస్సు యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. బస్సు యాత్ర కోసం పవన్ ప్రత్యేక బస్సును దగ్గరుండీ మరీ తయారు చేయిస్తున్నారు. ముందుగా దీనిని పూణెలో తయారు చేయించాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లోనే రెడీ చేస్తున్నారు. అయితే ఈ బస్సుకు అనేక ప్రత్యేకతలు ఏంటంటే?
 
అచ్చం సినిమా క్యారీ వ్యాన్ లా తలపించే ఈ బస్సు చిన్న ఇల్లులా ఉండేలా మార్చుతున్నారు. అంటే ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఈ బస్సులోనే ఉంటాయి. 
 
ఈ బస్సులో కనీసం ఆరుగురు వ్యక్తులు సమావేశం కావచ్చు. యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో సమావేశం అవసరమైతే ప్రత్యేకంగా గదికోసం వెతుక్కోకుండా ఇందులోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ బస్సు హై సెక్యూరిటీని కలిగివుంటుంది. అంతేకాకుండా బస్సు యాత్రకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిఘానేత్రం కూడా బస్సుకు అమర్చారు. అంటే బస్సుకు నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా హై సెక్యూరిటీ విత్ జీపీఎస్ ట్రాకింగ్ ఫిట్ చేస్తున్నారు.
 
ఇక వాహనం లోపల అన్ని సౌకర్యాలతో పాటు వాహనం పైకి వెళ్లేందుకు పవర్ లిప్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు, వారందరికీ కనిపించేలా సరికొత్త డిజైన్ చేశారు.
 
ఇక సభలో ఉన్నవాళ్లందరికీ వినిపించేలా లెటేస్ట్ సౌండ్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు లైటింగ్ సిస్టంను కూడా ఆధునిక పద్ధతులతో అమర్చారు. ఇక ఈ వాహనం రంగు మిలటరీ రంగులో ఉండేలా చూసుకుంటున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments