Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుడికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం.. ఎవరా డాక్టర్?

ఓ డాక్టర్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఆ వైద్యుడు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన సేవలను కొనియాడుతూ.. పాదాభివందనం చేశారు.

Webdunia
సోమవారం, 31 జులై 2017 (11:21 IST)
ఓ డాక్టర్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఆ వైద్యుడు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన సేవలను కొనియాడుతూ.. పాదాభివందనం చేశారు. ఆయన పేరు డాక్టర్ చంద్రశేఖర్. 
 
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో స్థానికులను కిడ్నీ వ్యాధి పీడిస్తున్న విషయం తెల్సిందే. ఈ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా సీనియర్ వైద్యుడు చంద్రశేఖర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్... ఆయనకు పాదాభివందనం చేసి, ఆయనపట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశారు. 
 
ఆదివారం హార్వర్డ్ నుంచి వచ్చిన వైద్య బృందంతో సమావేశమై, వారు శోధించిన విషయాలను గురించి అడిగి తెలుసుకున్న పవన్, ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం, నీటిలో లోహాలు అధికంగా ఉండటం వంటి కారణాలతో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అన్నారు. హార్వర్డ్ నుంచి వచ్చిన డాక్టర్ సుబ్బిశెట్టి వెంకట్, ఈ ప్రాంతంలో పరిశోధనలకు అండగా నిలిచారని పవన్ ప్రశంసించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments