Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష!! 11 రోజుల పాటు ద్రవ ఆహారమే...

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (10:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి మాత దీక్షలో భాగంగా, పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు, పాలు, ఇతర ద్రవ రూప ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, 2023 జూన్ నెలలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రాజకీయ తార్ల కోసం ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్న పవన్.. దానికి వారాహి అనే పేరు పెట్టారు. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష కూడా చేపట్టారు. అలాగే, ఈ దఫా కూడా ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. 
 
కూటమి విజయంతో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నాం : నిర్మాత టీజీ విశ్వప్రసాద్ 
 
పీపుల్స్ మీడియా సంస్థ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం, అందులోనూ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కీలక భూమిగా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా అదో రకమైన ఆనందంలో ఉన్నట్టు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 
 
ఇటీవల జరిగిన ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పివి.పార్థసారధితో పాటు చిత్రసీమకు చెందిన పలువురు సినీతారలు పాల్గొన్నారు. వారంతా తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని కొనియాడారు.
 
ఇందులో నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నా. అలాంటిది ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం దొరికింది. పవన్‌ అభిమానులందరూ ఒకరకమైన ఆనందంలో ఉన్నారు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ, అసెంబ్లీలో అడుగు పెట్టి మాట్లాడుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని వ్యాఖ్యానించారు. ఇందులో శ్రీవాస్, చందూ మొండేటి, శ్రీరామ్‌ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, బన్నీ వాసు, కృతి ప్రసాద్, హైపర్‌ ఆది, ఎస్‌కెఎన్, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, టి.ప్రసన్న కుమార్, బాలాదిత్య, సప్తగిరి, మంగ్లీ పాల్గొన్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments