జనసేన పోటీ చేసిన సీట్లు 136... డిపాజిట్లు కోల్పోయిన సీట్లు 120

Webdunia
శనివారం, 25 మే 2019 (12:56 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 136 చోట్ల పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట విజయాన్ని సాధించింది. చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఫలితంగా ఆ పార్టీ ఏకంగా 120 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.13 కోట్ల ఓట్లు పోలయ్యాయి. వీటిలో జనసేనకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు.. నోటా గుర్తుకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం.
 
గత 2009 ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 అసెంబ్లీ సీట్లు దక్కించుకోగా, ఎమ్మెల్యేగా చిరంజీవి సైతం గెలుపొందారు. ఆ పార్టీకి ఏకంగా 18 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. కానీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మాత్రం కేవలం ఏడు శాతం ఓటు బ్యాంకును మాత్రమే సొంతం చేసుకుంది. 
 
అయితే, జనసేన పార్టీకి ఎందురైన ఘోర పరాజయంపై పవన్ కళ్యాణ్ అపుడే సమీక్షలకు శ్రీకారం చేపట్టారు. పూర్తి స్థాయి సమీక్షలను మాత్రం జూన్ నుంచి చేపట్టనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, ఓటమికి గల కారణాలను జూన్ నెలలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమై చర్చించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments