నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

ఐవీఆర్
శనివారం, 23 నవంబరు 2024 (12:01 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం వెనుక పవన్ కల్యాణ్ ప్రభావం కూడా వున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం ద్వారా 70% కాంగ్రెస్ బలమైన స్థానాలను NDA ఖాతాలో పడేట్లు చేసారని చెబుతున్నారు.
 
దేగులూర్, లాతూర్ సిటీ, భోకర్, బల్లార్‌పూర్, షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ నార్త్, షోలాపూర్ సౌత్ & పూణే ఇక్కడ విదర్భ, ఇతర నియోజకవర్గాల్లో జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళుతోంది. ప్రధానమంత్రి మోదీ అన్నట్లు... పవన్ కల్యాణ్ తుఫాన్ ప్రభంజనం మహారాష్ట్రలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.
 
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశ ఎన్నికల పోలింగ్ జరుగగా అధికార మహాయుతి కూటమి - BJP, శివసేన, NCP (అజిత్ పవార్ వర్గం) మ్యాజిక్ ఫిగర్ దాటి 215 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA)- కాంగ్రెస్, శివసేన(UBT), NCP (శరద్ పవార్ వర్గం) కేవలం 58 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు 105 విజయం సాధించగా ఇప్పుడు 2024లో ఆ సంఖ్య 122కి చేరుకుంటోంది. ఇది ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రభావం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. దీన్ని నిజం చేస్తూ పవన్ ప్రభావం ఆ నియోజకవర్గాల్లో వున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద మహారాష్ట్రలో పవన్ ప్రభంజనం స్పష్టంగా కనబడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments