Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నజీయర్ స్వామితో భేటీ.. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ.. జనసేనాని ట్వీట్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (13:06 IST)
Pawan_Chinna Jeeyar
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చిన్నజీయర్ స్వామితో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల ధ్వంసంపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆలయాలపై దాడులు జరుగుతున్న సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచాయి. 
 
ఇక జీయర్‌తో భేటీ సందర్భంగా పవన్ చెవిలో చెప్పిన ప్రవచనాన్ని పవర్ స్టార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. "నీ మతాన్ని ఆరాధించు... ఎదుటి మతాన్ని గౌరవించు" అంటూ జీయర్ స్వామి చెప్పిన వాక్యాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. "గతంలో లౌకిక వాదంపై నేను మాట్లాడిన మాటలను ఇప్పటి పరిస్థితుల్లో మళ్లీ ప్రస్తావించాలని భావించినప్పుడు మొన్న గుంటూరులో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి" అని ట్వీట్ చేశారు పవన్.
 
"స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ (Worship your own... Respect all)" అని క్లుప్తంగా జ్ఞానబోధ చేశారని.. "హిందూ దేవతా ఆరాధనలో ఏ లోటు జరగకూడదు, అదే సమయంలో ఇతర మతాల పట్ల ఆదరణ, గౌరవం తగ్గకూడదు. స్వామివారు చెప్పిన ఈ మహావాక్యం సర్వమతాల వారికి ఆచరణీయం" అని పవన్ కల్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments