Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం పట్టణాన్ని రూ. 100 కోట్లతో ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతా: పవన్ కల్యాణ్

సెల్వి
శనివారం, 30 మార్చి 2024 (22:16 IST)
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరో మూడు రోజుల పాటు జనసేనాని పిఠాపురంలో పర్యటించనున్నారు. జనసేన అధినేత తన తొలిరోజు ప్రచారంలో పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగలేదని, ఈసారి తనను గెలిపించాలని పిఠాపురం ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ వినతి చేశారు. పరాజయం తర్వాత కూడా తాను దశాబ్దం పాటు ఒంటరి యోధుడినే అంటున్నారు పవన్ కళ్యాణ్.
 
ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘2019లో కూడా నేను అడగలేదు. అయితే ఈరోజు నన్ను గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. నేను మీకు అండగా ఉంటాను. నేను 54 గ్రామాల నుండి ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నాకు మీ ఆశీస్సులు కావాలి. పిఠాపురం పట్టణాన్ని రూ. 100 కోట్లతో ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతా దయచేసి నన్ను గెలిపించండి. దూకుడుతో తన సాధారణ ప్రసంగాలకు భిన్నంగా, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూల్, కంపోజ్డ్‌గా కనిపించింది. పవన్ కళ్యాణ్ ప్రచారంలో పిఠాపురం టీడీపీ నేత వర్మ కూడా కనిపించారు. 
 
అంతకుముందు.. తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ వర్మ ఇంటికి చేరుకున్నారు. వర్మను పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కల్యాణ్​కు వర్మ, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నాయకుల్ని వర్మ పవన్ కల్యాణ్​కు పరిచయం చేశారు. 
 
వర్మ పిఠాపురం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు కష్టించి పని చేశారని ఆయన సీటు తనకు త్యాగం చేశారని పవన్ తెలిపారు. పార్టీ పటిష్టత కోసం వర్మ కృషి చేశారని పవన్ కొనియాడారు. ఈసారి పీఠం కూటమిదే అని  పవన్ ధీమా వ్యక్తం చేశారు. 
 
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో నెగ్గుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పవన్ గెలుపు కోసం నిజాయితీతో  తెలుగుదేశం శ్రేణులు పని చేస్తాయని వర్మ హామీ ఇచ్చారు. పిఠాపురంలో అత్యధిక మోజార్టీతో పవన్ కల్యాణ్​ను గెలిపించుకుంటామని వర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments