Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరి బాటలో పవన్ కళ్యాణ్... ఏపీ సీఎం పీఠం ఎక్కేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక హోదా విషయంలో 50 శాతానికి ఒక్క శాతం ఎక్కువున్నా జ

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (21:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక హోదా విషయంలో 50 శాతానికి ఒక్క శాతం ఎక్కువున్నా జనసేన అధినేత ఎట్టి పరిస్థితుల్లో హోదాపై రాజీ పడే ప్రసక్తే ఉండదని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే సరే అని అనుకుంటున్నట్లయితే ప్యాకేజీ ద్వారా వారికి వనగూరే ప్రయోజనాల ఏమిటన్నది తెలుసుకునేందుకు కసరత్తు కూడా చేస్తున్నారట. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న కొన్ని ప్రాంతాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే లిస్టవుట్ చేశారట. ఆ లిస్టును ఖరారు చేసిన తర్వాత సినిమాల్లో నటించడం మానేసి ఎర్ర కండువాతో పాదయాత్ర మొదలుపెడతారనే మాటలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి ఏపీలో వున్న ప్రజలందరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడి తీరాల్సిందేనని పవర్ స్టార్ గట్టిగా అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే గతంలో వైఎస్, బాబు పాదయాత్రలు చేసి సీఎం పీఠాన్ని దక్కించుకున్నట్లు పవన్ కూడా దక్కించుకుంటారేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments