Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆరూ.. నోరు పారేసుకోవద్దు: పవన్ కళ్యాణ్ హితవు

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (11:04 IST)
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్‌కు క్లాజ్ తీసుకున్నారు. ఇష్టానికి నోరు పారేసుకోవద్దని సూచించారు. జనసేన పార్టీ బలోపెతానికై పూర్తి స్థాయిలో కసరత్తు ఇంకా ప్రారంభించలేదని గురువారం అన్నారు. 
 
సర్వేలో పాల్గొనడానికి పవన్ నిరాకరించినట్టుగా వస్తున్న వార్తలపై పవన్ స్పందిస్తూ ఆ రోజు తాను నగరంలో లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేసీఆర్ ఇకనైనా ద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడకూడదని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మంచి పాలకుడిగా ఉండమని సూచించారు.
 
తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీపై స్పందిస్తూ పదవీ ప్రమాణాలు చేపట్టిన వెంటనే వీరిరువురూ ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకుని ఉంటే రెండు నెలల క్రితమే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు.
 
కాగా గురువారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలని తగిన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ మీడియాతో అన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్టార్ కంపైనర్‌గా వ్యవహరించిన పవన్ తాజాగా అమిత్ షాతో భేటీ అవడం పలు చర్చలకు దారి తీస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. 

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments