Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహనం మెండుంగా ఉండాలి : పవన్ కళ్యాణ్

నిజ జీవితంలో ఏదైనా సాధించ‌డానికి చాలా స‌హ‌నం కావాలని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. రెండు రోజుల‌ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి తెలుగు విద్యార్థుల‌తో స‌మావేశమ‌య

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (12:21 IST)
నిజ జీవితంలో ఏదైనా సాధించ‌డానికి చాలా స‌హ‌నం కావాలని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. రెండు రోజుల‌ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి తెలుగు విద్యార్థుల‌తో స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ... నిజ జీవితం అంటే సినిమాల్లోలా ఉండ‌ద‌ని, సినిమాల్లో వెంట వెంట‌నే ఏదైనా అయిపోతుందని వ్యాఖ్యానించారు. 
 
కానీ నిజ‌జీవితంలో అలా కాదని, చాలా స‌మ‌యం ప‌డుతుందన్నారు. భార‌త్‌లో కులాల ప్రాతిప‌దిక‌న‌ రిజ‌ర్వేష‌న్ల అంశంపై ప‌వ‌న్ మాట్లాడుతూ... రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చిన‌ రిజ‌ర్వేష‌న్లు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయ‌ని, అవి అవ‌స‌రం లేని ప‌రిస్థితి వ‌స్తే బాగుండేదన్నారు. 
 
స‌మాన‌త్వం వ‌చ్చేస్తే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ మార్పు వ‌స్తోంద‌ని, అప్ప‌ట్లో వెన‌క‌బ‌డిన కులం అని చెప్పుకునేందుకు నామూషీగా భావించేవారని, కానీ ఇప్పుడు ఆ భావ‌న తొలిగిపోతోందని తెలిపారు. 
 
భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం ఉండటం ప్ల‌స్ పాయింట్ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. కానీ, స్వేచ్ఛ ముసుగులో ఇష్టం వ‌చ్చిన‌ట్లు పౌరులు ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్దని సలహా ఇచ్చారు. దేశం కోసం మ‌న వైపు నుంచి మ‌నం ఏం చేయ‌గ‌ల‌మ‌ని ప్ర‌శ్నించుకోవాల‌ని ఆయన విద్యార్థులకూ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments