Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వంటి వ్యక్తులను ప్రధాని ఖచ్చితంగా శిక్షిస్తారు : పవన్ కళ్యాణ్

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:21 IST)
అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా శిక్షిస్తారని జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, జగన్ తన కేసుల గురించి మాఫీ చేసుకునేందుకు ప్రధాని మోడీ వద్దకు వెళ్లేవారన్నారు. మోడీ అలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వరన్నారు. ముఖ్యంగా, అనేక అవినీతి కేసులు ఉన్న జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద గట్టిగా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. కానీ, తాను మాత్రం మాట్లాడగలనని చెప్పారు. 
 
తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే యువత జీవితాలు బాగుపడతాయని చెప్పారు. 14 యేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లుగా సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారన్నారు. దశాబ్దకాలంగా పోరాడుతూనే తాను ఉన్నానని, మాకు అండగా నిలబడండి.. రాష్ట్రం కోసం పని చేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments