వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం హస్తినబాట పట్టిన పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:16 IST)
ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని చూస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో పెను రాజకీయ సునామీకి దారితీసింది. ఈ ప్లాంట్‌ను ప్రైవేట్ పరంకాకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు.
 
అలాగే, వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని జనసేన నిశ్చయించింది. ఈ క్రమంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పయనమయ్యారు. 
 
పవన్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హస్తినకు వెళ్లారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే అంశంపైనా, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపైనా పవన్, నాదెండ్ల బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చిస్తారని జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments