Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవనూ... ప్రత్యక్షంగా పట్టుబడ్డ వారి సంగతి మాట్లాడవయ్యా... హరీష్ రావు

Webdunia
బుధవారం, 8 జులై 2015 (09:35 IST)
పవన్ అసలు విషయాన్ని వదిలేసి ఓటుకు నోటు కేసులో ఇతర విషయాలను మాట్లాడుతున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నేరుగ పట్టుబడ్డ వారిపై తన అభిప్రాయాలను గాలికి వదిలేసి సండ్ర వీరయ్య గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పవన్ తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని హితవు పలికారు. 
 
మెదక్ జిల్లా పుల్కల్ మండలం సింగూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసులో ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడం సరైంది కాదని అన్నారు. 
 
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీపై వ్యాఖ్యానించకుండా టీఆర్‌ఎస్ టార్గెట్‌గా విమర్శలు చేయడం పవన్‌కు తగదన్నారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను అభినందిస్తూనే మరోవైపు విమర్శించడం భావ్యం కాదన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments