Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ గుంటూరు జిల్లా తుళ్లూరు పర్యటన వాయిదా!

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (11:01 IST)
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమ, మంగళ వారాల్లో గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తమ ప్రాంతంలో పర్యటించబోతున్నారని తెలిసి ఆ ప్రాంతంలో రైతులు సర్వ సన్నాహాలూ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని సమాచారం అందుతోంది. 
 
వాస్తవానికి ఆ ప్రాంత రైతుల విజ్ఞప్తి మేరకు ఆయన సోమవారం రాజధాని నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో సోమవారం పర్యటించాలని భావించారు. అయితే ఆ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీన పవన్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా బడ్జెట్లో  ఏపీకి అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
 
రాజధాని కోసం రైతులనుంచి పంట భూములను సమీకరించడంపై ట్విట్టర్‌లో పవన్ ఇటీవల తీవ్రంగా స్పందించడం తెలిసిందే. 'ఎంతో నమ్మకంతో ప్రజలు బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపించారు. వారు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపైనే ఉంది' అని పవన్ ట్వీట్ చేయడం విదితమే. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments