Webdunia - Bharat's app for daily news and videos

Install App

48 గంటల్లోగా నేరచిట్టాను విప్పాలి.. పార్టీలకు సుప్రీం కోర్టు ఆదేశం

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:20 IST)
ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేరచిట్టాను పార్టీలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక అడుగులు వేసింది.
 
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని స్పష్టం చేసింది. 
 
ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎంపికైన అభ్యర్థులు 48గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బహిర్గతం చెయ్యాలని ఆదేశించింది.
 
పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాలను కూడా వివరించాలని, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో పెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, అటువంటి అభ్యర్థుల వివరాలను కూడా దినపత్రికల్లో ప్రచురించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments