Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రులు ఇక అబద్ధాల సీరియల్‌ను ఆపండి!: పరకాల ఫైర్

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (19:08 IST)
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్‌గా చెబుతున్నారని.. వీటిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. జల వివాదంపై పరకాల సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చన్న పదమేలేదని ఆయన స్పష్టం చేశారు. '69 జీవో'లో చెప్పిన అంశాన్నే '233 జీవో'లో నొక్కి చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తించాలని కోరారు. 
 
చెప్పిన అబద్ధాలనే తెలంగాణ నేతలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని, తెలంగాణ మంత్రి హరీష్ రావు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారన్నారు. ఇంగ్లిష్ భాషా పండితులైన హరీష్ రావుగారే మరోసారి జీవోను చదువుకోవాలని సూచించారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా హరీష్ రావుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. 
 
ఏదో ఒక పేపర్ తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే నిజమైపోతుందా? అని పరకాల నిలదీశారు. కాసేపు సాగునీరు, తాగునీరు, విద్యుత్... ఇలా ప్రతి అంశంపై ఏదో ఒక వివాదం రాజేయడమే పనిగా పెట్టుకున్నారని పరకాల మండిపడ్డారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments