Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

ఐవీఆర్
శుక్రవారం, 2 మే 2025 (23:38 IST)
అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ మాట్లాడారు. '' 26 మంది అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతోంది. కానీ ఆ దేశం నమో మిసైల్ ను చూస్తే భయపడుతోంది. నమో అంటే ఇంకెవరో కాదు... మన నరేంద్ర మోడి. ఆయన కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుంది. వంద పాకిస్తాన్ దేశాలు కలిసి వచ్చినా భారతదేశాన్ని ఏమీ చేయలేరు అంటూ చెప్పారు నారా లోకేష్.
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ...  ''అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కల్యాణ్ కృషితో అమరావతి నగరం అధునాతన నగరంగా మారుతుంది. వచ్చే 3 సంవత్సరాల తర్వాత సంపూర్ణంగా పూర్తయిన అమరావతి నగరానికి వస్తాను. ఇక్కడ ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏపీ-తెలంగాణకు కలిపి రైల్వే బడ్జెట్ రూ.900 కోట్లు లోపు ఇచ్చేవాళ్లం. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రూ. 9 వేల కోట్లు నిధులను ఇచ్చాము.
 
అమరావతి ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైలు మార్గం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి సాయం చేస్తుంది. చంద్రబాబు గారు నేనేదో టెక్నాలజీ పరంగా దూసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఐతే గతంలో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాదులో అప్పుడు సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారన్నది దగ్గరగా చూసాను. టెక్నాలజీకి సంబంధించి ఆలోచనలు చేయడంలో బాబును మించినవారు ఎవ్వరూ లేరని చెప్తాను.
 
మీకు ఓ ముఖ్య విషయం చెప్పబోతున్నాను. జూన్ 21న మీ అందరితో కలిసి ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొంటాను. మన యోగాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వుంది. కనుక రానున్న 50 రోజులు ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ప్రపంచ రికార్డు సృష్టించేలా ఇక్కడ యోగా కార్యక్రమాలు నిర్వహించాలి" అని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments