Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ అక్కసు.. యునిసెఫ్‌కు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (17:45 IST)
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్‌ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై తన కడపు మంటను వెళ్లగక్కుతూ యునిసెఫ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్‌కు లేఖ రాశారు. 'జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు' అని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. 
 
కాగా, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రాను ఓ పాకిస్థాన్ మహిళ..'భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉంటూ ఇలా ప్రవర్తించడం ఏంటి?' అని నిలదీసింది.'
 
దీనిపై ప్రియాంకా స్పందిస్తూ, పాకిస్థాన్‌లో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. పైగా, నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా. ఇలా అందరిలో అరిచి నీ పరువు పోగొట్టుకోకు అని ఘాటుగానే సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments